ఆతిధ్యం ఇవ్వడంలో మంతెన మంగపతిరాజుగారికి మించినోళ్లు లేరా పశుల్లంక వూళ్లో….
ఊళ్లకి గొప్పోళ్లెవరోచ్చినా గోదారొడ్డునున్న ఆ రాజు గారి గాలిమేడలో దిగి ఆయనిచ్చే ఆతిధ్యం పుచ్చుకునేల్లాల్సిందే.
వాళ్ల గాలిమేడ వున్న రేవులో ఒక ఇంజను పడవ కట్టేసుంటుంది. పొద్దొయెకా వచ్చిన అతిధులు వంటోళ్లు వడ్డించేవాళ్లతో పాటు గోదారి మధ్యలో వున్న పేన్మత్సోరిలంకలో వున్న వాళ్ల గెస్ట్ హౌస్ లో కెళ్తారు.
రాత్రి పదయ్యేదాకా ఆ వంటల కార్యక్రమం. తర్వాత గోదాట్లో ములిగి తలారా స్నానం చేసి కడిపి లంక మల్లెపుల్లాంటి బట్టలేసుకుని గెస్ట్ హౌస్ మధ్యలోకొచ్చి కుర్చున్నాకా మొదటి పెగ్గు చాలా పెద్దది పోసుకుని వాళ్లతో పాటు తాగడం మొదలెడుతుంటే వంటోళ్లు వడ్డించేవాళ్లు వంటలు పళ్లలో పెట్టుకుని పట్టుకొస్తుంటారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
Nallamillori Palem Kathalu - నల్లమిల్లోరి పాలెం కథలు
- Title: Nallamillori Palem
- Author: Vamsi
- Publisher: Sahithi Prachuranalu
- ISBN: MANIMN1060
- Binding: Paperback
- Published Date: 2019
- Number Of Pages: 371