Product details
ఎన్ని పేజీల డైలాగ్ నైనా ఒకటి లేక రెండుసార్లు మాత్రమే చదివి మొత్తం గుర్తుపెట్టుకోగల అసాధారణ ధారణా శక్తి ఆయనది! కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, దర్శకునిగా స్క్రీన్ప్లే రచయితగా, రచయితగా అనేక పాత్రలను పోషించి ఆయన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడయ్యారు.
ప్రపంచంలో మనకున్న మద్రాసీ ముద్రను చెరిపేసి, సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించి, మనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను తెచ్చిన ఘనత ఆయనది! తెలుగులో
277 సినిమాల్లో ఆయన నటించారు.
భాషకోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని, మహిళలకోసం పద్మావతీ విశ్వవిద్యాలయాన్ని, బలహీన వర్గాలకు తన పార్టీలో టికెట్ ను, పేదవారికోసం రెండురూపాయల బియ్యం పథకాన్ని, తెచ్చి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసిన అభ్యుదయవాది, దార్శనీకుడు, కర్మయోగి, తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం ఎన్.టి.ఆర్!
ఎన్.టి.ఆర్ శతజయంతి సందర్భంగా, ఆయన సినిమా, రాజకీయ జీవితాన్ని గురించి, ఎన్నోసార్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారు, నిష్పక్షపాతంగా, ఆరోగ్యకరంగా అందించిన పుస్తకం ‘మహానటుడు ప్రజా నాయకుడు ఎన్టీఆర్.’ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కుమార్తెల సమక్షంలో ఆయన శతజయంతి నాడు ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. ఎంతోమంది ప్రముఖుల మన్ననలు పొంది బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఎన్టీఆర్ గారిని గురించిన ఎన్నో అరుదైన విశేషాలు ఇందులో ఉన్నాయి.
చక్కని ఈ పుస్తకం ధర: 250rs. పోస్టల్ చార్జీలు 50rs అదనం.
ఆసక్తికలవారు 8558899478 అనే నెంబరుకు వాట్స్ ఆప్ చేయగలరు.🙏
Mahanatudu Prajanayakudu NTR
మహానటుడు ప్రజా నాయకుడు ఎన్టీఆర్
Author: Bhageeradha
No.of pages:172
Year of publication: 2022
Price: 250
Similar products